Friday, November 15, 2024

తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి ః ఎలాంటి తప్పులు లేని స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించాలని కలెక్టర్ శరత్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఓటరు జాబితాపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్టోబర్ 1నాటికి 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు.

బిఎల్‌ఓలు ఓటరు జాబితాతో ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి నుండి ఫారం 6 సేకరించి నమోదు చేయాలన్నారు. ఓటరు జాబితా పునః పరిశీలన వేగంగా జరగాలన్నారు. చిరునామా మార్పు తదితర దరఖాస్థుల పరిశీలన పరిష్కారంలో జాప్యం చేయరాదన్నారు. ఓకే ఇంటినెంబర్‌లో ఆరు మంది కన్నా ఎక్కువ ఓటర్లు ఉంటే ధృవీకరించుకోవాలని సూచించారు. ఫారం 7ద్వారా మరణ ధ్రువీకరణ పత్రం ఉంటేనే జాబితాలో పేర్లు తొలగించాలని గతంలో తొలగించిన వారి పేర్లు మరోమారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పొరపాటుగా తొలగించినట్లయితే తిరిగి ఫారం 6ద్వారా నమోదు చేయాలన్నారు. తప్పుడు లేని ఓటరు జాబితా రూపొదించుటలో ఆయా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఓ మనోహర్, డిఆర్‌ఓ నగేష్ తహశీల్దార్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News