నల్గొండ: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శుద్దీకరించిన ఓటర్ జాబితా తయారు చేయాలని జిల్లా క లెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆర్‌డీఓలు మండలాల తాసీల్థార్‌లతో ఓటర్ జాబితా రూపకల్పనపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 13 నాటికి డబుల్ ఓటర్లు చనిపోయిన వారు లేని ఓటర్ జాబితాను సిద్దం చేయాలన్నారు.జిల్లాస్థాయి నుండి మండల స్థాయి వరకు అన్ని వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు. బిఎల్‌ఓలు, సూపర్వైజర్లు అందరూ విధులలో చరుకుగా పనిచేసేలా చూసుకోవాలని తాసీల్థార్లకు సూచించారు. బిఎల్‌ఓలు, సూపర్వైజర్లు మార్పులు వుంటే ప్రతిపాదనలు కలెక్టర్లు,జిల్లా ఎన్నికల అధికారికి పంపి తుది జాబితా ఆమోదం పొందాలన్నారు. బీఎల్‌ఓల పోను నెంబర్లు అం దుబాటులో ఉంచుకోవాలన్నారు.
ప్రతి బిఎల్‌ఓ దగ్గర కొత్తగా రూ పొందించిన ఓటరు జాబితాలిస్టులతో పాటు బిఎల్‌ఓ రిజిస్ట్రర్ అం దుబాటులో ఉండాలన్నారు. రిజిస్ట్రర్ అందుబాటులో ఉండాలన్నా రు. ఇంటింటి సర్వేను పకడ్భందిగా నిర్వహించి పూర్తి చేయాలని ఆర్‌ఓనెట్ ఆన్లైన్లో సేవలు జులై 13 వరకు మాత్రమే పనిచేస్తుందని ఆన్‌లైన్ ద్వారా వచ్చిన ధరఖాస్తులు అన్నింటిని క్షేత్రస్థాఁధలో పరిశీలించుకొని పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. అర్హత గల అంగవైకల్యం కలవారు వారు ఓటర్‌గా నమోదె అయ్యారా లేదా పరిశీలించి ఓటర్ జాబితాలో ఫాం 8 ద్వారా మార్క్ చేయించాలని తెలిపారు.
నూతన ఓరట్‌గా నమోదుకు ఫాం 6 ద్వారా ధరఖాస్తు చే యించాలని అన్నారు.తహసీల్థార్ పోలింగ్ కేంద్రాలు కనీస వసతులు 5 రోజుల్లో పరిశీలించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సమావేశం నిర్వహించి ఓటర్ జబితా చేరికలు, తొలగింపులు అందజేయాలని, మినిట్స్ రికార్డు చేయాలని సూచించారు.రాబోవు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందు కు తహసీల్థార్లు అందరూ పూర్తి బాధ్యత తో పనిచేయాలని ఆదేశించారు. ఈవిసిలో డిఆర్‌డిఓ కాళిందిని జడ్‌పిసిఈ ఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, జిల్లా మహిళా శిశు వయోవృద్దులు, దివ్యాంగుల శాఖ అధికారిణి కృష్ణవేణి పాల్గొన్నారు.