Monday, December 23, 2024

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: పెరుగుతున్న పట్టణ జనాభా, విస్తీర్ణానికి తగ్గట్లుగానే అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధ్దంగా ముందుకు సాగుతున్నామని, 2014 కంటే ముందే అనేక సమస్యలకు పరిష్కారం చూపి ప్రజల ఇబ్బందులు దూరం చేశామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంధర్ స్పష్టం చేశారు. పట్టణంలోని కైలాష్ నగర్‌లో నిర్మాణంలో ఉన్నా సమీకృత మార్కెట్ పనులను ఆదివారం ఆయన పర్యవేక్షించారు. నాయకులు రాం కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి పనులను పరిశీలించిన నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఏడు కోట్ల ఇరువూ లక్షల వ్యయంతో అయిదేకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్నా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను నిర్థేశిత సమయంలో పూర్థి చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మార్కెట్ పనులను పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంధర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో పట్టణ వాసులకు మౌలిక వసతులను కల్పించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల నిత్యావసర సరుకులు ఒకే చోట లభ్యమయ్యేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. పెరుగుతున్నా పట్టణ విస్తీర్ణానికి తగ్గట్లుగానే వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల సుందరీకరణ పనులు పూర్థయ్యాయని , ప్రధాన వీధుల్లోనూ అభివృద్ధి ్ద పనులు చురుగ్గా సాగుతున్నాయని పేర్కొన్నారు. అమెరికాలో ఉండి వచ్చి ఇక్కడ పరిస్థితుల పై కనీస అవగాహణ లేని ఓ నాయకుడు చేస్తున్నా వ్యాఖ్యాలను తప్ప పెట్టిన ఆయన 2014 కంటే ముందు పరిస్తితుల గురించి సదర్ నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీస వసతులు కల్పనలోన విఫలమైందన్నారు. తొమ్మిదేళ్ల వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధ్ది పనులు చేపట్టి పట్టణ రూపురేఖలు మార్చామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News