Sunday, December 22, 2024

కాబూల్‌లో పేలుడు: 15 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Blast in Kabul
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో దాదాపు 15 మంది గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ పేలుడుకు కారణాలు ఏమిటనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. తాలిబన్ అధికారులు కూడా ఏమి తెలుపలేదు. దీనికి సంబంధించి అసోసియేట్ ప్రెస్ వార్తా సంస్థ తీసిన వీడియోను కూడా సైట్ నుంచి తొలగించారు. ద్రవ్య మారకం నిర్వహించే మార్కెట్‌లో ఈ పేలుడు సంఘటన జరిగిందని ద్రవ్య మారకందారు వైస్ అహ్మద్ తెలిపారు. పేలుడు సంఘటన జరిగిన వెంటనే మార్కెట్‌ను మూసేశారు. ఆ ప్రాంతాన్ని తాలిబన్లు చుట్టుముట్టారని తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News