Thursday, December 26, 2024

భర్తే హంతకుడు!

- Advertisement -
- Advertisement -

Tests were also conducted in Urdu in combine state

కొలిక్కివచ్చిన జంట హత్యల కేసు
వివాహేతర సంబంధమే కారణం
గతంలో పలుమార్లు మందలించిన భర్త
ఇద్దరిలో కనిపించని మార్పు ఇద్దరిని
హతమార్చేందుకు భర్త నిర్ణయం
పోలీసుల అదుపులో

మన తెలంగాణ/ హైదరాబాద్ : నగర శివారులో కలకలం సృష్టించిన జంట హత్యల కేసు దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కేసు మిస్టరి చిక్కుముడి వీడినట్లుగా విశ్వసనీయ సమాచారం. యువకుడు యశ్వంత్‌కు వివాహిత మహిళ జ్యోతిలకు ఉన్న వివాహేతర సంబంధమే హత్యలకు దారితీసాయని తెలిసింది. జ్యోతి భర్త శ్రీనివాస్‌రావు జంట హత్యలకు పాల్పడ్డ్డట్లు తెలిసింది. శ్రీనివాస్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నారు. పోలీసుల విచారంలో అసక్తికరమైన, సంచలనమైన విషయలు శ్రీనివాసురావు వెల్లడించినట్లు తెలిసింది. …విజయవాడకు చెందిన శ్రీనివాస్‌రావుకు జ్యోతి రెండో భార్య కాగ వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ మెట్టుగూడ వారసిగూడ బౌధనగర్‌లో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా శ్రీనివాస్‌రావు భార్య జ్యోతి సమీప ఇంట్లో ఉండే ఎడ్ల యశ్వంత్‌తో చనువుగా ఉంటూ వచ్చింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన జ్యోతి భర్త పలుమార్లు ఇరువురిని మందలించాడని తెలిసింది. అయిన ఇద్దరిలో ఏలాంటి మార్పు లేకపోవడంతో శ్రీనివాస్‌రావు హైద్రాబాద్ నుండి సొంత ఊరు విజయవాడకు మకాం మార్చేందుకు నిర్ణయం తీసుకున్నాడు.

భర్తను చివరి కోరిక కోరిన భార్య..?

విజయవాడకు మకాం మార్చే క్రమంలో చివరి సారిగా యశ్వంత్‌ను కలుస్తా అంటూ భర్త శ్రీనివాస్‌రావును భార్య జ్యోతి చివరి కోరికగా కోరిందని తెలిసింది. భార్య జ్యోతి బరితెగింపు భరించలేని భర్త శ్రీనివాస్‌రావు ఏలాగైన ఇద్దరిని హతమర్చేందుకు నిర్ణయించుకుని సరే అని అంగీకరించాడు. ఆదివారం సాయంత్రం యశ్వంత్, జ్యోతిలతో పాటు భర్త శ్రీనివాస్‌రావు సైతం స్కూటీ పై నగర శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం కొత్తగూడం బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. యశ్వంత్, జ్యోతిలు ఇద్దరు నిర్మానుష్యంగా ఉన్న చెట్ల పొదలకు వెళ్లారు. భర్త శ్రీనివాస్‌రావు స్కూటీ వద్దనే కొద్ది సేపు వేచి ఉన్నాడు. యశ్వంత్, జ్యోతిలను ఏకాంతగా ఉండగా అదును చూసి భర్త శ్రీనివాస్‌రావు వచ్చి ఒక్కసారిగా ఇద్దరి పై దాడి చేశాడు. యశ్వంత్ తలపై బలంగా సుత్తితో మోదడంతో అపాస్మరకస్థితిలోకి వెళ్లాడు. భయందోళనకు గురైన భార్య జ్యోతి వివస్త్రగానే ఉండటంతో ఏక్కడికి పారిపోలేక అక్కడే ఉండిపోయింది.

యశ్వంత్ మర్మాంగాలపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడిన అనంతరం జ్యోతిపై దాడి చేసి గాయపర్చి హత్య చేసినట్లు విచారణలో తెలిపాడని తెలిసింది. అక్కడ నుండి నేరుగా విజయవాడకు పారిపోయ్యాడని తెలిసింది. రెండు రోజుల తర్వాత రెండు మృతదేహాలు కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి లభ్యం కావడంతో జంట హత్యలు వెలుగు చూసాయి. ఈ జంట హత్యలు భర్త ఒక్కడే చేశాడా..? లేక ఇంకా ఏవరి ప్రమేయమైనా ఉందా..? విచారణలో శ్రీనివాస్ వెల్లడించిన విషయాలలో వాస్తావాలు ఎంత వరకు ఉన్నాయనే కోణాంలో పోలీసులు దర్యాప్తు కోనసాగుతుంది. సంచలనంగా మారిన జంట హత్యల కేసును పోలీసులు విచారణ పూర్తి చేసి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News