Monday, December 23, 2024

దేశానికే ఆదర్శంగా నిలిచిన తాగునీటి పథకం

- Advertisement -
- Advertisement -
  • చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

షాబాద్: దేశానికే ఆదర్శంగా నిలిచిన తాగునీటి పథకం, రాష్ట్రంలో ప్రతీ మారుమూల పల్లెకు పైపులైను ద్వారా తాగునీటిని అందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అం తారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచినీటి పండుగ మిషన్ భగీరథ ఉత్సవలను ఘనంగా నిర్వహించారు. ఆనంతరం జలప్రతిజ్ఞ చేశారు.

మిషన్ భగీరథ ప్లాంటు మొత్తం తిరుగుతూ పథకంకు సంబంధించిన వివరాలను సం బంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శుద్దిజలాలతో దశాబ్ది ఉత్సవాలు పదేండ్ల పండుగలో తెలంగాణ సంబరాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం హర్‌ఘర్‌జల్ పథకం పేరుతో అమలు చేస్తుండటం తెలంగాణ రాష్ట్రనికి గర్వకారణం ఉందన్నారు. ఈ పథకం ద్వారా అందిస్తూన్న స్వచ్చమైన, శుద్దమైన తాగునీటితో నల్గొండ జిల్లాను పట్టి పిడిస్తున్న ప్లోరైడ్ రక్కసిని నిర్మూలించిందన్నారు.

చేవెళ్ల నియోజకవర్గంలో మిషన్ భగీరథ అభివృద్ధి పనులు జిల్లాలోని శ్రీశైలం సెగ్మెంట్ పరిధిలోని తెలంగాణ ప్రభు త్వం రూ 76500 లక్షలు మంజూరు చేసిందన్నారు. 40ఏంఎల్‌డి నీటి శుద్దీకరణ కేంద్రం అంతారం అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో మిషన్ భగీరథ 200ఓహెచ్‌ఆర్ ట్యాంకులు మరియు 881 కిలోమీటర్ల పైప్‌లైన్ రూ 135 కోట్ల ఖర్చు చేశామన్నారు. చేవెళ్ల మండలంలో 18800 నాళ్లాలు, మొయినాబద్‌లో 17160 నాళ్లాలు, షాబాద్‌లో 16795 నాళ్లాలు, శంకర్‌పల్లిలో 20468 నాళ్లాలు ఉన్నట్లు తెలిపారు.

మిషన్ భగీరథ పథకంతో సురక్షిత మంచినీటి సరఫరా జరుగుతుందని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ ప్రకటించిందన్నారు. ఖచ్చితమైన ప్రణాళికతో, అత్యంత పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పద్దతులను వినియోగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయడం వల్ల ప్రభుత్వం రూ 8035.66కోట్ల ప్రజాధనాన్ని ఆదాచేయగలిగిందన్నారు.

మిషన్ భగీరథ పథకానికి నేషనల్ వాటర్ కమిషన్ 2019 అవార్డు కింద ప్రథమ బహుమతి ఇచ్చిన్నట్లు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు నల్లా కనెక్షన్ల ద్వారా నీటిని అందిస్తునందుకుగానూ జల్ జీవన్ అవార్డ్ 2022 కింద ప్రథమ బహుమతి వచ్చిన్నట్లు తెలిపారు. వీటితో పాటు మరెన్నో అర్డులు, రివార్డులు మిషన్ భగీరథ పథకం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోట్ల ప్రశాంతిమహేందర్‌రెడ్డి, వివిధ మండలాల నాయకులు, వివిధ శాఖల అధికారులు, మిషన్ భగీరథ సిబ్బంది తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News