Monday, January 20, 2025

అభివృద్ధిలో ఆదర్శం… తెలంగాణనే నిదర్శనం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

తాండూర్ రూరల్: అభివృద్ధిలో తెలంగాణ దేశానికి నిదర్శనమైందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూర్ మండల పరిధిలో ని భవానీ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా నిర్వహించిన సంక్షేమ పథకాల దినోత్సవంలో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే పైలట్ రోహిత్ రెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అనేక సంక్షమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణనేనని, కెసిఆర్ అంటేనే సంక్షే మం, సంక్షేమం అంటేనే కెసిఆర్ అని అన్నారు. రైతులకు రైతుబీమా, రైతుబం ధు, ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాల య చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, వైస్ చైర్మన్ దీప నర్సి ంలు, ఎంపిపి అనిత రవిగౌడ్, వైస్ ఎంపిపి స్వరూప వెంకట్‌రాంరెడ్డి, తాం డూర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News