Sunday, January 19, 2025

ఇంటిగ్రెటెడ్ మార్కెట్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులను జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటిలో ఎక్కడ లేని విధంగా జిల్లా కేంద్రంలో వేజ్,నాన్ వేజ్ ఇంటిగ్రెటెడ్ మార్కెట్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈనెల 24న ప్రార ంభించనున్నట్లు తెలిపారు.

ప్రారంభం రోజు నాటికి సంబంధిత అధికారులు మార్కెట్‌లో ఉన్న అన్ని రకాల పనులనూ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆలోచన విధానంతో ప్రజలు అన్ని రకాల పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం,చేపలు ఒకే చోట లభించేలా మార్కెట్‌ను నిర్మించినట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, డీఎంవో శర్మ, సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News