Sunday, January 12, 2025

ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి

- Advertisement -
- Advertisement -

నంగునూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలి మృతి చెందిన సంఘటన నంగునూరు మండలంలోని సిద్ధన్నపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. రాజగోపాల్‌పేట పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నంగునూరు మండలంలోని సిద్ధన్నపేట గ్రామానికి చెందిన దేవులపల్లి మల్లవ్వ భర్త బాలయ్య (75) తన ఇంటిలో బాత్‌రూమ్ లేనందున తన ఇంటి నుంచి బహిర్భూమి కోసమై బయటకు వెళ్లింది. దేవులపల్లి మల్లవ్వకు కళ్ళు సరిగా కనబడకపోవడంతో ప్రమాదవశాత్తు కాలు జారి వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. మృతురాలి కుమారుడు కనకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రాజగోపాల్‌పేట ఎస్‌ఐ రాజు గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News