Wednesday, January 22, 2025

క్షుద్ర పూజలు చేస్తుందంటూ వృద్ధురాలిపై దాడి

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : క్షుద్ర పూజలు చేస్తుందంటూ ఓ వృద్ధురాలిపై ఓ వ్యక్తి కర్రతో దాడి చేసిన సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీస్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మద్దికొండ గ్రామానికి చెందిన కొరసా వెంకట నర్సమ్మ గత కొంతకాలంగా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటుంది. కాగా ఇంటి పక్కన గల మొడియం రంగారావు అనే వ్యక్తి నర్సమ్మ క్షుద్ర పూజలు చేస్తుందంటూ కర్రతో దాడి చేశాడు. ఈ విషయంపై నర్సమ్మ కుమారుడు బుచ్చిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News