Wednesday, January 22, 2025

కాంగ్రెస్ లేని విపక్ష కూటమి భ్రమే

- Advertisement -
- Advertisement -

An opposition alliance without Congress is an illusion

సీనియర్ నేత జైరాం రమేష్

కొల్‌కతా : కాంగ్రెస్ రహిత బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు మిథ్యనే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో నిమిత్తం లేకుండా జట్టుకట్టాలనుకునే ప్రతిపక్ష నేతలు పగటికలల్లో ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్ష సమైక్యత దిశలో ఇప్పుడు పలువురు నేతలు ప్రయత్నిస్తున్న విషయాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. కాంగ్రెస్‌లేకుండా విపక్ష ఐక్యత అనేది ప్రహసనం అవుతుందన్నారు.మమ్మల్ని దూరం చేస్తే విపక్ష కూటమి డీలా పడిపోతుంది. పైగా కాంగ్రెస్ దెబ్బతింటుందని దీని వల్ల ప్రయోజనం ఎవరికి? అని రమేష్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను దూరం పెట్టి విపక్ష కూటమి ఏది కూడా కేంద్రంలో స్థిరమైన సర్కారును ఏర్పాటు చేయలేదని, ఇందుకు భిన్నంగా ఆలోచించే వారు ఎవ్వరైనా భ్రమలలో ఉన్నట్లే అవుతుందని వ్యాఖ్యానించారు. పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌కు తమ స్వార్థం కోసం వెన్నుపోటు పొడిచాయని విమర్శించారు. కాంగ్రెస్‌ను తమ ప్రత్యర్థిగా భావించుకునే వైఖరిని ఈ పార్టీలు విడనాడాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News