Wednesday, January 22, 2025

కాంగ్రెస్ తో పొత్తుపై అవగాహన కుదిరింది… : సిపిఐ సీనియర్ నేత నారాయణ

- Advertisement -
- Advertisement -

సీట్ల పంచాయతీయే తేలాల్సి ఉంది : సిపిఐ నారాయణ

మన తెలంగాణ/హైదరాబాద్ : ’ఇండియా’ కూటమి తరహా రాజకీయా అవగాహనతో ముందుకు వెళ్తామని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని ఆయన వెల్లడించారు. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని అదికూడా రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. పొత్తుల అంశంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ పార్టీతో సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేయాలనేది తన ఉద్దేశమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదన మాకు రాలేదు. జాతీయస్థాయిలో ’కూటమిలో’ కాంగ్రెస్ వామపక్షాలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తాం. పొత్తుల సీట్ల అంశం మీద తొందర లేదు. నామినేషన్లు వేసే వరకు సమయం ఉంది. సీట్లపై చర్చలు కొనసాగుతున్నాయి’ అని నారాయణ వెల్లడించారు.

ఎన్నికల కోసమే మహిళ బిల్లు
ఎన్నికల కోసమే కేంద్రం మహిళ బిల్లు ప్రవేశ పెట్టిందని ఆరోపించారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే 2024 మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం కొనసాగితే దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోవడం ఖాయమన్నారు. కర్ణాటకలో బిజెపి ఓటమి ప్రధాని మోడీ ఓటమికి చెంప పెట్టులాంటిదన్నారు. ఎన్నికల ప్రచారాలు ఎన్నో చూశాం. కానీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవారు కర్ణాటకలో సుదీర్ఘకాలం అక్కడే ఉండి కులాలను మతాలను రెచ్చగొట్టే ఉపన్యాసాల ద్వారా ఓట్లు సంపాదించాలని ప్రయత్నించారని, కానీ అక్కడి ప్రజలు తిరస్కరించారని చెప్పారు. లౌకిక వ్యవస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి ప్రధాని మోడీ ఓట్ల కోసం కక్కుర్తి పడి చివరికి బజరంగ్ జిందాబాద్ అనే స్థాయికి వెళ్లడం ఆయన నైతికతకు నిదర్శనమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News