Sunday, January 19, 2025

తొమ్మిది సంవత్సరాల కాలంలో ఊహించని అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మన్ననూర్ : తెలంగాణ రాష్ట్రం లో ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మ ంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఉద యం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ని యోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి, స ంక్షేమ కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ కోటి వృక్షార్చనలో భాగంగా అమ్రాబాద్ మండలంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్‌తో కలిసి మంత్రి అచ్చంపేట, పెద్దమగుడు రహదారిపై మొక్కలను నాటారు.

అనంతరం అమ్రాబాద్ మండలంలో రూ. 62 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేశారు. అక్కడే నూర్ భాషా సంఘం మైనార్టీ కమ్యూనిటి హాల్ నిర్మాణ ం, ఖబరస్తాన్ మస్జీద్ రూ. 30 లక్షల మరమ్మతు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏ-ర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల అవసరాలను గుర్తిస్తూ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దళితుల మొహంలో వెలుగులు నింపే దళిత బంధు లాంటి కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అ మలు చేయడం జరుగుతుందన్నారు.

రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్, కోటి 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి మి షన్ భగీరథ ద్వారా సాగునీరు, కులమతాల భేదభావం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో ఊహించని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. 24 గంటల ఉచిత వి ద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతు బంధుకు రూ. 15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అచ్చంపేట శాసన సభ్యులు చాలా పట్టుదల గల వారని ఉమామహేశ్వర ప్రాజెక్టును తీసుకువచ్చి అప్సర ప్లాట్‌ను సస్యశ్యామలం చేస్తారని తెలిపారు.

వారి అభ్యర్థన మేరకు అచ్చంపేట నియోజకవర్గంలో చారకొండ మండలం మాదిరి అమ్రాబాద్ లేదా మరో మం డలం మొత్తానికి దళిత బంధు మంజూరు చేసే విధ ంగా ముఖ్యమంత్రికి తన వంతు సిఫారసు చేస్తానని హామి ఇచ్చారు. అనంతరం కుమ్మరోనిపల్లిలో మైనార్టీ కమ్యూనిటి హాల్, సిసి రోడ్లు, రాయలగండి గ్రామంలో దేవాలయం, కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్, ఎ మ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ అమ్రాబా ద్ మండలానికి ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయ డం జరిగిందన్నారు.

త్వరలో మరో 6 లేదా 7 కోట్ల నిధులు విడుదల చేయిస్తానని తెలిపారు. ఉమామహేశ్వరం ప్రాజెక్టును సాధించడం జరిగిందని, త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. అప్సర్ ప్లాట్‌కు సాగు నీరు తేవడమే తన లక్షంగా తెలిపారు. చారగొండ మాదిరి అమ్రాబాద్ లేదా మరో మండలానికి దళిత బంధు మంజూరు చేసే విధంగా సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిని కోరారు. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు లాంటివి జరగవని, ఒకవేళ ఈ ప్రాంతంలో గునపం లాంటివి దిగాలంటే ముందు తన గుండెల్లో దింపాల్సి వస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్‌ఓ రోహిత్ గోపిడి, ఆర్డిఓ కె. గోపిరాం, డిఆర్‌డిఓ నర్సింగ్ రావు, జిల్లా ఎస్సి సంక్షేమ శాఖ అధికారి రామ్‌లాల్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, అమ్రాబాద్ సర్పంచ్ శారద, తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News