Friday, November 15, 2024

జ్ఞాపకంలోనూ మరవని స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

మీ మానవత్వం సమాజానికి ఆదర్శం…
మీరు చేసే ప్రకృతి సేవకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అండ….
విజయలక్ష్మిని అభినందించిన ఎంపి సంతోష్

హైదరాబాద్ : ‘ప్రతీ మనిషి జీవితంలో బంధం, అనుంబంధం, వాటి తాలూకూ జ్ఞాపకాలు మనుషుల్ని నడిపిస్తుంటాయి. అయితే అందరూ తమకు ఇష్టమైన వ్యక్తుల జ్ఞాపకాల్ని గుండెల్లో దాచుకుంటే.. కొందరు మాత్రం వాటికి ఆకృతినిచ్చి ఆరాధిస్తుంటార’ని రాజ్యసభ సభ్యులు, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు.

ఆరు సంవత్సరాల క్రితం తన నుంచి దూరమైన తన భర్త జ్ఞాపకాలను, తన భర్త పుట్టిన రోజు నాడు నాటిన చెట్టులో చూసుకుంటూ ప్రతీ సంవత్సరం తన భర్త పుట్టిన రోజు నాడు ఆ మొక్కకు బర్త్‌డే వేడుకలు జరుపుతున్న వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కోట్రికా విజయలక్ష్మిగురించి తెలుసుకున్న ఎంపి సంతోష్ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. ‘జీవితం ఉన్నంత వరకూ ఇష్టపడ్డ వ్యక్తుల జ్ఞాపకాలు ఉంటాయని, అవి వారు గుర్తొచ్చిన ప్రతీ క్షణం మన హృదయాన్ని కదిలిస్తుం టాయని, అయితే, జ్ఞాపకాలను ప్రకృతితో మమేకం చేయాలనే ఆలోచన అద్భుతమైనదని జ్ఞాపకం, గుర్తుగా మిగిలిపోకుండా సమాజం బాగుకోసం ఆలోచించడం చాలా అరుదైన విషయమని’  అభినందించారు. ‘బాధను కూడా పది మంది బాగుకు మార్చిన మీ మానవత్వం సమాజానికి ఆదర్శమ’ని ప్రశంసించారు. ‘మీరు చేసే ప్రకృతి సేవకు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సదా అండగా ఉంటుందని ఎంపి సంతోష్ హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News