Friday, November 22, 2024

ఎప్పటికి మరచిపోలేని పేరు నల్లా భీంరెడ్డి రాంరెడ్డి

- Advertisement -
- Advertisement -

లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ గ్రామ ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికి మరిచిపోలేని పేరు నల్లా భీం రెడ్డి, వారి కుమారుడైన రాం రెడ్డి పేరు అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం లక్ష్మణచాంద మండలంలోని వడ్యాల్ గ్రామంలో 1953 నుంచి 1981 వరకు పరిపాలించిన భీం రెడ్డి అలాగే వారి కుమారుడైన నల్లా రాం రెడ్డి 1949 నుంచి 1995 వరకు సర్పంచ్‌గా రాంరెడ్డి సేవలను ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికి మర్చిపోవద్దన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ వడ్యాల్ భీం రెడ్డిగారు అప్పట్లోనే గ్రామ సర్పంచ్‌తో పాటు సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారని, నా చిన్ననంతోనే వారిని ఎన్నో సార్లు కలువడం జరిగిందన్నారు.

అలాగే వారి కుమారులైన నల్లా రాం రెడ్డి గారు విద్యార్థి దశ నుంచే రాజకీయ విలువలు తెలిసిన వ్యక్తిగా వారితో నాకు చిరకాల సంబంధం ఉందని, వారు నాకన్న వయస్సులో ఐదు సంవత్సరాలు పెద్ద వారైన వారి రాజకీయ సేవలను మనం ఎప్పటికి మర్చిపోవద్దన్నారు.ఆ ఇద్దరి మహానుభావుల విగ్రహాలను నేడు మనం వడ్యాల్ గ్రామంలో ఆవిష్కరించుకోవడం ఎంతో అదృష్టం అన్నారు. అప్పటి కాలంలోనే భీంరెడ్డి గారు సమితి అధ్యక్షుడు పదవి చేపట్టడం ఎంతో గౌరవకారణమన్నారు. అలాగే రాంరెడ్డి గారు ఈ ప్రాంతంలో నీటి సమస్య గానీ, రహదారి సమస్య గానీ తీర్చి ప్రజలందరికి సుపరిపాలన అందించిన వ్యక్తుల పేరు పొందారన్నారు.

అలాగే అప్పటి కాలంలోనే పనికి ఆహార పథకం కింద పనులు చేస్తూ ఈ పథకాన్ని ప్రజలు పొందేవారని గుర్తు చేశారు.అలాగే భీంరెడ్డి గారు ఈ వడ్యాల్ గ్రామానికి ఎంతో కృషి చేశారని, నీటి మళ్లీంపు విషయం గానీ, హై స్కూల్ విషయం గానీ, కనకాపూర్ నుంచి లక్ష్మణచాంద వరకు రహదారి మంజూరు విషయంలో నల్లా భీంరెడ్డి సేవలు ఎంతో ఆదర్శంగా నిలిచాయన్నారు.అలాగే రాం రెడ్డి సేవలు సైతం ఎంతో అద్భుతంగా ఉండేవని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ అట్ల లలీత రాం రెడ్డి, లక్ష్మణచాంద మొదటి అధ్యక్షుడు నరేంధర్ రెడ్డి, డిసిసిబి వైస్ చైర్మన్ ఎర్ర రఘునందన్ రెడ్డి, వైస్ ఎంపిపి కల్పన రాం రెడ్డి, జడ్పీ చైర్మన్ కోరిపెల్లి విజయలక్ష్మీ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,నిర్మల్ ఎంపిపి కోరిపెల్లి రామేశ్వర్ రెడ్డి, జెడ్పిటిసి ఓస రాజేశ్వర్, లక్ష్మణచాంద మాజీ సర్పంచ్ రాం రెడ్డి, మండల ఇంచార్జీ అల్లోల సురేంధర్ రెడ్డి, వికాస్‌రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News