Wednesday, January 22, 2025

దళితుడిపై అగ్ర కులానికి చెందిన యువకుడు దాడి

- Advertisement -
- Advertisement -

తిరుమలాయపాలెం : ఓ దళితుడిపై అగ్రకులానికి చెందిన ఓ యువకుడు విచక్షణ రైతంగా దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం… పిండిప్రోలు గ్రామానికి చెందిన పగిడిపల్లి బాబు ఎవర్ సైన్ స్కూల్ బస్ క్లీనర్ గా పని చేస్తున్నాడు. గ్రామాల్లో స్కూలు పిల్లలను బస్సులో ఎక్కించుకునేందుకు వెళ్లగా అక్కడ అదే గ్రామానికి చెందిన తాతా మనోజ్ అనే వ్యక్తి ట్రాక్టర్ బస్సుకు అడ్డంగా ఉండడంతో సైడ్ ఇవ్వాలని కోరగా నీకెందుకు సైడ్ ఇవ్వాలిరా.. అని 60 సంవత్సరాల పైబడిన వృద్దుడు పగిడిపల్లి బాబుపై విచక్షణ రహితంగా పిడిగుద్దులు గుద్దుతూ, తన్నుతూ కులం పేరుతో దూషిసూ,్త అరాచానికి పాల్పడ్డాడు. తాత మనోజ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తాతా మనోజ్ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పార్టీ ముఖ్య నాయకుడికి దగ్గర బంధువు కావడంతో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిసింది.

ఈ సందర్భంగా పిండిప్రోలు గ్రామానికి చెందిన దళితులంతా ఏకమై ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీసులు చట్టం ఎవరికీ చుట్టం కాదని తప్పు చేసిన వ్యక్తిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అతనిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. పిండిప్రోలు గ్రామానికి చెందిన తాత మనోజ్ కమ్మ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కావడంతో ఆయన అరాచకాలు పెట్రేగిపోతున్నాయి. గ్రామంలో తన సొంత వాహనాలైన టిప్పర్లు, బంపర్లు, ట్రాక్టర్లు జెసిబి వాహనాలతో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్న రాత్రి సమయాలలో అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టి తరలిస్తూ వెంచర్లకు, పెట్రోల్ బంకులకు మట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారని పిండిప్రోలు దళితులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యులు గుంతేటి వీరభద్రం, యూనిట్ ఆఫ్ మాల జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు, మండల అధ్యక్షులు గుజ్జ రామకృష్ణ, కెవిపిఎస్ నాయకులు నాగటి సురేష్, గోపోజి పిచ్చయ్య, పప్పుల నరసింహారావు, పదముత్తు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News