బాడీ బిల్డింగ్ కోసం తీసుకున్న సప్లిమెంట్లలో ఎనబాలిక స్టెరాయిడ్లు ప్రమాదకరం
ఏం చేయాలో, చేయాకూడదో తెలుసుకుంటే గుండె వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గుండె కవాటాల వ్యాధులో సంభవించే మరణాలు దేశంలో సంభివిస్తున్న మొత్తం మరణాల్లో దాదాపు 25శాతం వరకు ఉంటున్నాయి. ఇవే మరణాలకు అత్యధిక కారణాలు. గత దశాబ్ద కాలంగా చాలామంది యువత సీవీడి బారిన పడి మరణించడం అత్యంత ఆందోళనకరమైన విషయంగా మారింది. ఈప్రమాదకర పరిణామానికి అనేక కారణాలున్నాయని కిమ్స్ ఆసుపత్రి కార్డియాలజిస్టు డా. ప్రణీత్ పోలమూరి తెలిపారు. వ్యాధులపై పలు విషయాలు వివరిస్తూ మనమంతా ఎక్కువగా చిన్న వయస్సులోనే సీవీడీకి గురైతున్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇక్కడ కేసుమరణాల రేటు ఎక్కువ. రక్తపోటు, మధుమేహం, అదనపు కొలెస్ట్రాల్, ధూమపానం లాంటివన్నీ సీవీడీకి ప్రధాన కారకాలని అందరికి తెలుసు. మనకు తెలియకుండానే ఉండే అధిక రక్తపోటు సీవీడీకి ముఖ్య కారణం.
ప్రతి నలుగురు మగ పెద్దలలో ఒకరికి రక్తపోటు ఉన్నా వారిలో మూడింట ఒక వంతు మందికి మాత్రమే ఈసమస్య ఉందని తెలుస్తుంది. అందులో సమస్య గురించి తెలిసిన వారిలో, మూడింట ఒక వంతు మంది మాత్రమే తమ రక్తపోటును నియంత్రణలో ఉంచుకుంటున్నారు. అధిక రక్తపోటు పెరుగుదల ఊబకాయం, నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం, ధూమపానం, అధికంగా మధ్య సేవించడం లాంటి కారణాలున్నాయి. కొవిడ్ నేపథ్యంలో చాలా మంది వర్క్ ప్రమ్ హోంకు మారారు. దీనితో శారీరక శ్రమ లేకపోవడం, ఆహార సమయాలు సరిగా ఉండకపోవడం, నిద్ర తగినంతగా లేకపోవడం లాంటివి పెరిగాయి. ఇవన్నీ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. దేశంలో చాలా ఎక్కువగా ఉన్న మధుమేహం కూడా ఒక ప్రధాన ప్రమాదకారకం అని ఎవరు మరిచిపోకూడదన్నారు.
యువత విషయానికొస్తే తోటి వారి కంటే తాము ఫిట్‌గా కనిపించాలనే ఆకాంక్షతో ఒత్తిడికి గురైతున్నారు. అందులోనూ తొందరంగాఫలితాలు కనబడాలన్న అదుర్ధాతో ఎక్కువ వర్క్‌వుట్లు చేస్తున్నారు. ప్రతి ఒకరూ కోరుకునే మెలితిరిగిన కండలు కావాలంటే కేవలం బారీ బరువులు ఎత్తడమే కాకుండా సప్లిమెంట్లు కూడా అవసరం అవుతాయి. కానీ ఈసప్లిమెంట్లలో అనాబాలిక్ స్టెరాయిడ్లు ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం పాటు బారీ మోతాదులో తీసుకుంటే హానికరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ వర్కౌట్స్‌తో గుండె కొట్టుకునే రేటుతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇవి గుండెపై ఒత్తిడి కలిస్తాయి. ప్రతి అవయవానికి కొత్త డిమాండ్లకు తగినంత సమయం అవసరం.
వ్యాయామ చేసేటప్పుడు విరామం తీసుకోవడం, శరీరం కోలుకునేలా చేయడం కూడా అంతే ముఖ్యం. కానీ వ్యాయామాల షెడ్యూలులో దీన్ని చాలా మంది చేర్చరు. ఇక మద్యం తాగేవారు దీంతో పాటు కలిసి తీసుకునే ఆహార పదార్దాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. సంతృప్త కొవ్వులూ అధికంగా ఉంటాయి. వీటివల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. అతిగా మద్యం తాగడంతో గుండెలయ అసాధారణంగా మారుతుంది. చికిత్స కంటే నివారణే ఉత్తమం అని తెలిసిన తగిన అవగాహన పెంచుకుంటే, ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన పర్యవేక్షణలో చేసే శారీరక శ్రమతో సీవీడీలు రాకుండా చూసుకోవచ్చు. ప్రమాద కారణాలేంటో తెలుసుకోవడం, వాటిని నియంత్రణలో ఉంచుకోవడం కీలకమని సూచనలు చేస్తున్నారు.