Sunday, December 22, 2024

మహిళల్లో ఎనీమియా తీవ్రత..

- Advertisement -
- Advertisement -

దేశంలో రక్తహీనత (ఎనీమియా) బాధితుల్లో 50 శాతం ఐరన్ ధాతువు లోపం వల్లనే అని కొన్ని అధ్యయనాల వల్ల బయటపడింది. దేశంలో ఏడాది వయను నుంచి 19 ఏళ్ల వయసు పిల్లలను అధ్యయనం చేయగా, ఐరన్, సీరమ్ బి 12, ఫోలేట్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్లనే ఎనీమియా సంక్రమిస్తోందని తేలింది. అలాగే 10 నుంచి 19 ఏళ్ల కౌమార ప్రాయంలో ఉన్న బాలలను అధ్యయనం చేయగా, వీరిలో 22 శాతం మందిలో రక్తహీనతకు ఫోలేట్, బి 12 లోపించడే కారణంగా తేలింది. ఐరన్ లోపించిన ఎనీమియా కేసులు 27 శాతం బాలికల్లో కనిపించాయి. ఎలాంటి కారణం కానీ, వాపు కానీ లేకుండా ఎనీమియా వచ్చిన కేసులు 31 శాతం వరకు ఉన్నాయి.

మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలో గర్భిణులైన మహిళల్లో రక్తహీనతను, న్యూరల్ ట్యూబ్ లోపాలను అంటే బిడ్డపుట్టుకతో వచ్చే లోపాలను పరిష్కరించడానికి ఫోలేట్, బి 12 కలిగిన టీ ఎంతవరకు ప్రభావం చూపుతుందో 43 మంది మహిళలపై ప్రయోగాలు చేశారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. 19 మంది వంతున రెండు గ్రూపులను, ఐదు మందిని మూడో గ్రూపుగా చేసి వీరికి ఫోలేట్, బి12 అందించారు. మొదటి గ్రూపు 19 మందికి ఒక మి.గ్రా ఫోలేట్, 1 మి.గ్రా బి12 కలిగిన టీ ఇచ్చారు. రెండో గ్రూపు లోని 19 మందికి 1 మి.గ్రా ఫోలేట్, 0.5 మి. గ్రా కలిగిన టీ ఇచ్చారు. మూడో గ్రూపు సాధారణ గ్రూపుగా ఉంచారు. ఫలితంగా వీరిలో హెమోగ్లోబిన్ స్థాయిలు పెరగడాన్ని పరిశోధకులు గమనించారు.

అయితే ఈ స్థాయిలు ఒకేలా కనిపించలేదు. ఎందుకంటే ఇందులో పరిశోధకులు ఇచ్చే టీలో ఐరన్ లోపించడమే అని స్పష్టమైమది. దీన్ని బట్టి ఐరన్, ఫోలేట్, బి 12 ఈ మూడింటిలో ఏది లోపించిన ఎనీమియాకు దారి తీసే అవకాశం ఉంటుందని స్పష్టమైంది. గర్భిణుల్లో బిడ్డ పుట్టుకతో లోపాలు ఏర్పడే పరిస్థితి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పునరుత్పత్తి వయసున్న అంటే 1549 ఏళ్ల మధ్య మహిళల్లో సగానికి సగం మంది రక్తహీనతతో బాధపడుతుంటారు. వాస్తవానికి ఇదేం జబ్బు కాకపోయినా అనేక వ్యాధులకు ముఖ్యమైన కారణాల్లో ఇదొకటి అని చెప్పవచ్చు. పౌష్టికాహార లోపం వల్లనే రక్తహీనత ఏర్పడుతుంది. దీనిని ఎనీమియా ( anemia) అని అంటారు.మహిళలకు పిరియడ్స్ వచ్చే సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. ప్రసవ సమయంలో ఎక్కువగా రక్తస్రావమైతే ప్రాణాపాయం ఏర్పడుతుంది. బాలింతల మరణాల్లో ఎక్కువ శాతం రక్తహీనత తోనే చనిపోతుంటారు. తక్కువ బరువుతో నెలలు నిండకుండా బిడ్డలు పుట్టడానికి రక్తహీనతే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్‌లో 72 శాతం మంది రక్తహీనతతో బాధ పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. దేశం మొత్తం మీద 201415 కన్నా 201819 లో ఇది ఒకశాతం పెరిగింది. ఐరన్, విటమిన్ బి 12. ఫోలేట్, ఎ విటమిన్ లోపాలు ఉంటే ఈ సమస్య మరింత తీవ్రమౌతుందని వైద్యులు వివరిస్తున్నారు. గర్భిణులు పోషకాహారం సరిగ్గా తీసుకోకుంటే తల్లీబిడ్డలపై రక్తహీనత తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశం లోని గిరిజన ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించడానికి పోషకాహారం వారికి సంపూర్ణంగా అందకపోవడమే అని చెప్పవచ్చు. రక్తహీనత వస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. కొద్ది నిమిషాలు నడిచినా, లేదా తేలికపాటి శారీరక శ్రమ చేసినా, శ్వాస తీసుకోలేక పోతుంటారు. సాధారణంగా రక్తం తక్కువగా ఉంటే చర్మం రంగు కూడా మారుతుంది. రక్తహీనత ఉన్న కొందరిలో మంచుముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం, తదితర పదార్థాలను తినాలనిపిస్తుంది. తరచూ తలనొప్పి వస్తుంది. ఐరన్ లోపం వల్ల ఏర్పడే రక్తహీనత కారణంగా ఇతర సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. గ్రహణ శక్తి తగ్గుతుంది. ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది.

జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. అలసట, నీరసం కనిపిస్తాయి. ఎనీమియా ఏర్పడకుండా ఉండాలంటే 4 నుంచి 12 నెలల వయసున్న చిన్నారులకు రోజుకు 120 మైక్రోగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. అలాగే 1314 నెలల వయసున్న వారికి 56 మైక్రోగ్రాములు, 2 నుంచి 5 ఏళ్ల వయసున్న వారికి 44 మైక్రోగ్రాములు , గర్భిణులకు 24 మైక్రోగ్రాములు ఐరన్ అవసరం అవుతుంది. మెనోపాజ్ దశలో ఉన్న మహిళకు 43 మైక్రోగ్రాములు ఐరన్ కావాలి. ఐరన్ అనేక ఆహార పదార్ధాల్లో లభిస్తుంది. బాజ్రా, రాగి, గోధుమలు, శెనగపప్పు, బఠానీ, తోటకూర, గొర్రెకాలేయం, మాంసం వంటి వాటిలో లభిస్తుంది.

ఈ సమస్యను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం రక్తహీన రహిత భారత్ అనే పథకాన్ని నాలుగేళ్ల కిందట రూపొందించింది. ఏటా 3 శాతం వరకు రక్తహీనత తగ్గించేలా లక్షం పెట్టుకుంది. ఐరన్, ఫోలిక్ యాసిడ్ తదితర ఔషధాలు, పౌష్టికాహారం అందించడానికి సిద్ధమైంది. దీనికి తోడు నులిపురుగుల నివారణ కార్యక్రమాలు చేపట్టింది. రక్తహీనతపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ప్రయత్నించింది. అయితే ఈ కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News