సహాన ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో రచయిత, దర్శకుడు తారక రామ మాట్లాడుతూ “ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశాము. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రం తెలుగు వారే. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వాతావరణం చాలా వింతగా ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో సినిమా చేయడం చాలా కష్టమైనప్పటికీ ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉంది. మొత్తం షూటింగ్ 122 రోజుల్లో 83 లోకేషన్స్‌లో పూర్తి చేశాము”అని చెప్పారు. అనగనగా ఆస్ట్రేలియాలో మూవీ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. మంచి థ్రిల్లర్ ఇదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. యదార్థసంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.
యదార్థసంఘటనల ఆధారంగా…
- Advertisement -
- Advertisement -
- Advertisement -