Friday, January 10, 2025

‘అనగనగా ఒక రాజు’ టైటిల్ టీజర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘జాతి రత్నాలు’ మూవీలో హిలేరస్ కామెడీతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ ఎనర్జిటిక్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి తన కామెడితో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం నవీన్ నటిస్తున్న మూడో చిత్రానికి ‘అనగనగా ఒక రాజు’ అనే టైటిల్ ఖరారు చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్ టీజర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇందులో నవీన్ తన కామెడీ పంచ్ లతో నవ్వులు పూయించాడు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Anaganaga Oka Raju Title Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News