- Advertisement -
అమరావతి: టిడిపి సవాల్ స్వీకరించేందుకు వైసిపి నేతలు భయపడ్డారని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపణలు చేశారు. తిరుమల గోశాల విషయంలో వైసిపి అబద్ధాలు ప్రచారం చేస్తుందని మరోసారి స్పష్టమైందని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..టిటిడి విషయంలో వైసిపి చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలు అయ్యాయని తెలియజేశారు. గోవుల పేరుతో భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అసత్య ప్రచారాలు నిరూపించలేకపోయారని అనగాని విమర్శించారు. వాస్తవాలు చూపించేందుకు ఎప్పుడూ తాము సిద్ధమేనని చెప్పారు. వైసిపి ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
- Advertisement -