Monday, December 23, 2024

ముక్కలు ముక్కలుగా నరికి.. పెట్రోల్ పోసి తగలబెట్టారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి ప్రాంతం యలమంచిలి ఎర్రవరం సమీపంలో దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పోసి మహిళ మృతదేహాన్ని కాల్చినట్లుగా ఆనవాళ్లు లభించాయి. యలమంచిలిలోని చెరుకుకాటా దగ్దర మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా స్థానికులకు కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి ప్రాంతంలో మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీస్తున్నారు. మృతదేహం ఎవరిదని తెలిస్తే దర్యాప్తు చేయడం సులభం అవుతుందని, స్థానికి సిసి కెమెరాల ఆధారంగా విచారణ చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం కూడా రెండు మృతదేహాలు లభ్యంకావడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. ప్రేమ వ్యవహారం, అక్రమ సంబంధాల వ్యవహారం నేపథ్యంలో ఎక్కువగా మహిళలను హత్య చేస్తున్నానరి స్థానికులు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News