Wednesday, January 22, 2025

ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని అనకాపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తెనాలికి చెందిన శివరామకృష్ణ-మాధవి అనే దంపతులు కొన్ని రోజులుగా అనకాపల్లిలో నివసిస్తున్నారు. అప్పులు బాధలు ఎక్కువ కావడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. శివరామకృష్ణ(40), మాధవి(38) తన ముగ్గురు కుమార్తెలకు సైనైడ్ తాగించి అనంతరం వారు తాగారు. స్థానికులు గుర్తించి వారిని ఆస్పత్రికి తరలించారు. నలుగురు చనిపోగా చిన్న కుమార్తె కుసుమప్రియ(13) చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News