Friday, December 20, 2024

ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్…16 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అనకాపల్లి: ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం స్పెషల్ ఎకనామిక్ జోన్(సెజ్)లో ఓ కంపెనీ రియాక్టరు పేలి  ఈ దుర్ఘటన జరిగింది. ఎస్సెన్సియా ఫార్మా కంపెనీలో ఈ రియాక్టర్ ఒత్తిడి పెరిగి పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 16 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దట్టమైన పొగలు గ్రామంలో కమ్ముకోవడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. కాగా హోం మంత్రి అనిత స్పందించి కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. వివరాలు తెలుసుకుని బాధితులకు మెరుగైన సేవలందించాలని  అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News