Monday, December 23, 2024

సాక్షి నీది కాదా జగన్?: ఆనం

- Advertisement -
- Advertisement -

అమరావతి: సాక్షి టివి ఆయనది కాదని జగన్నాటకాలు ఆడుతున్నారని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. సాక్షి సంగతే ఆయనకు తెలియనట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనం మీడియాతో మాట్లాడారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి లక్కీ నంబర్ లక్ష అని, రూ. లక్షతో పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని ధ్వజమెత్తారు. జగతి పబ్లికేషన్స్ కూడా రూ. లక్ష పెట్టుబడితో పెట్టిందేనని, అందులో రూ.35 వేలు విజయసాయి రెడ్డి పెట్టుబడి పెట్టారని ఆరోపణలు చేశారు. జె. జగన్ మోహన్ రెడ్డి రూ.30 వేలు పెట్టుబడి పెట్టారని, కామత్ అనే మరో వ్యక్తి రూ.35 వేలు పెట్టుబడి పెట్టారని ఆనం విమర్శలు గుప్పించారు. మొదటిగా విజయసాయిరెడ్డి సాక్షిలో డైరెక్టర్‌గా ఉన్నారని, విజయసాయి రెడ్డి రాజీనామా చేయగానే జగన్ డైరెక్టర్ అయ్యారని, జగన్ తరువాత వైఎస్ భారతీ రెడ్డి డైరెక్టర్ అయ్యారని పేర్కొన్నారు. వీళ్లంతా డైరెక్టర్లుగా ఉంటే జగన్‌కు సంబంధం లేదా? అని ప్రశ్నించారు. లక్ష రూపాయల కంపెనీలు వేల కోట్లుగా ఎలా మారాయని ఆనం ప్రశ్నించారు. వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయని, తనకేమీ సంబంధం లేదని జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆనం చురకలంటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News