Thursday, January 16, 2025

‘బేబి’ కాంబోలో మూవీ చేస్తున్నాం: ఆనంద్ దేవరకొండ

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గం..గం..గణేశా‘. ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘గం..గం..గణేశా‘ శుక్రవారం గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండతో ఇంటర్వూ…

మంచి సినిమా ఇది…
దర్శకుడు ఉదయ్ శెట్టి పంపిన స్క్రిప్ట్‌లో అత్యాశ, భయం, కుట్ర అనే మూడు పదాలు నన్ను ఆకట్టుకున్నాయి. నాకు స్వామి రారా వంటి క్రైమ్ కామెడీస్ చూడటం ఇష్టం. ఆ సినిమా చూసినప్పుడు మన తెలుగులో ఇలాంటివి ఇంకా మరికొన్ని సినిమాలు చేయొచ్చు కదా అనిపించేది. అటువంటి మంచి సినిమా ఇది.
హ్యాపీగా, నమ్మకంగా ఉన్నా…
మా డైరెక్టర్ ఉదయ్ కథను అందరికీ నచ్చేలా స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. కథలో ఒక పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి. ఇంతమందితో పర్‌ఫార్మ్ చేయించుకోవడంలో ఒక డెబ్యూ డైరెక్టర్‌గా ఉదయ్ సక్సెస్ అయ్యాడు. నేను ‘గం..గం..గణేశా‘ పట్ల హ్యాపీగా, నమ్మకంగా ఉన్నాను.

థియేటర్‌లోనే ఎంజాయ్ చేయగలరు…
ఇటీవల ఫ్యామిలీ, యూత్ ఆడియెన్స్ కోసం ‘గం..గం..గణేశా‘ స్పెషల్ షోస్ వేశాం. వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్‌టైన్ అవుతూ ఎంజాయ్ చేశారు. వాళ్ల నమ్మకం చూసి మాకు మరింత నమ్మకం వచ్చింది. సాధారణంగా ఈ యాక్షన్ కామెడీస్ థియేటర్‌లో చూస్తేనే ఎంజాయ్ చేయగలరు.
అది ఈ సినిమాలో చూపిస్తున్నాం…
వినాయకుడి విగ్రహం చుట్టూ జరిగే కథ ఇది. ఆ విగ్రహం దక్కించుకోవడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ విగ్రహంలో అంత విలువైనది ఏముంది. ఎవరికి విగ్రహం దక్కింది అనేది కథాంశం. మనలోనూ భయం, అత్యాశ, కుట్ర అనే లక్షణాలు ఉంటాయి. అవి కొందరి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం.

తదుపరి చిత్రాలు…
నాకు రా యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం. ధనుష్ కర్ణన్, అసురన్ మూవీస్‌లాంటి సినిమాలు చేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు వినోద్ అనంతోజు, సితార ఎంటర్ టైన్ మెంట్స్ కాంబోలో చేస్తున్న మూవీ అలాంటి ఫార్మాట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ సాయి రాజేశ్, ఎస్‌కేఎన్, వైష్ణవి, నేను కలిసి బేబి కాంబోలో ఓ మూవీ చేస్తున్నాం. వీటితో పాటు స్టూడియో గ్రీన్ వారి డ్యూయెట్ సినిమాలో నటిస్తున్నా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News