Friday, December 20, 2024

ఆనంద్ మహీంద్రా తొలిసారి డిజిటల్ కరెన్సీ‘ఈ-రూపీ’తో పండ్లు కొన్నారు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఇటీవల భారత డిజిటల్ కరెన్సీని ‘ఈ-రూపీ’ లేక ‘ఈ-ఆర్’ను ఉపయోగించి స్థానిక వ్యాపారి వద్ద తాజా పండ్లను కొనుగోలు చేశారు. ‘ఈ-రూపీ’ ఎలా పనిచేస్తుందో అనే వీడియోను ఆయన ట్విటర్ మైక్రోబ్లాగింగ్ సైట్లో షేర్ చేశారు. ఆయన దానిమ్మ పండ్లను ఓ వ్యాపారి నుంచి కొనుగోలు చేశారు. కానీ చెల్లింపు మాత్రం డిజిటల్ మనీతో చెల్లించారు. పండ్ల వ్యాపారి అయిన బచ్చె లాల్ సహానీ ‘ఈ-రూపీ’తో లావాదేవీ నిర్వహించిన తొలి వ్యాపారి అని పేర్కొన్నారు.
వీడియోకు శీర్షిక కూడా పెట్టిన ఆయన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్ మీటింగ్‌లో డిజిటల్ కరెన్సీ ‘ఈ-రూపీ’ గురించి తెలుసుకున్నానన్నారు. ఆర్‌బిఐ మీటింగ్ అయిపోయాక,  అదెలా పనిచేస్తుందో తెలుసుకుందామని ఆయన స్థానిక వ్యాపారి వద్దకు వెళ్లారు.

2022 డిసెంబర్ 1న భారత రిజర్వు బ్యాంకు ఆవిష్కరించిన ‘ఈరూపీ’ భారత్‌లో ఇక చెల్లుబాటవుతుంది. కేంద్ర బ్యాంకు ఇప్పుడున్న కరెన్సీ, నాణేల మాదిరిగానే ‘ఈ-రూపీ’ని లావాదేవీలకు గుర్తించింది. దీనిని మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలతో కూడా చెల్లింపులకు వాడుకోవచ్చు. ప్రస్తుతం డిజిటల్ మనీని బ్యాంకింగ్ సంస్థలే పంపిణీ చేస్తున్నాయి. ‘ఈ-రూపీ’ని ఉపయోగించి ఓనర్లు ‘పి2పి’ లేక  ‘పి2ఎం’ లావాదేవీల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. వారు క్యూఆర్ కోడ్‌ను కూడా ఉపయోగించుకుని చెల్లింపులు చేయొచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News