Sunday, December 22, 2024

ఆటో నడుపుకునే మహిళను శ్లాఘించిన ఆనంద్ మహీంద్ర

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: భర్త మరణానంతరం ఆటో నడుపుకుని జీవిస్తున్న పంజాబ్ మహిళను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. ఆమె ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. పంజాబ్‌లో మహీంద్ర ఎలక్ట్రిక్ ఆటో కొన్న తొలి మహిళ పరంజిత్ కౌర్ అని ఆయన తెలిపారు. ఒంటరి తల్లిగా ఆమె తన కూతుళ్లను ఆటో నడిపించి పోషించుకుంటున్నారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ ఆయన ‘ఆమె ఓ ప్రేరణ’ అని పేర్కొన్నారు. మహీంద్రా ఆల్ ఎలెక్ట్రిక్ ప్యాసింజర్ ఆటోరిక్షా ‘ఈఅల్ఫా మినీ’కి ఆమె ఓ గర్వకారణ ఓనర్ అని ఆనంద్ మహీంద్ర తన ట్వీట్‌లో అన్నారు.

ఆయన ట్వీట్‌ను స్వల్ప కాలంలోనే 8000 మంది రిసీవ్ చేసుకున్నారు. వందలాది మంది కామెంట్స్ కూడా పెట్టారు. చాలా మంది ఆమె కృత నిశ్చయాన్ని, కూతుళ్ల చదువుకు ఆమె చేపట్టిన సంకల్పాన్ని మెచ్చుకుంటున్నారు. ఒకరైతే “ ఈ మహిళకు శాల్యూట్, ఆమె మనో ధైర్యాన్ని కోల్పోకుండా కుటుంబం గడవడానికి పోరాడుతోంది. ఆమె నిజాయితీ శ్లాఘనీయం” అని వ్యాఖ్యానించారు. మరొకరైతే ‘ పరిస్థితులకు ఎదురు నిలిచి పోరాడుతున్న ఆదర్శనీయ మహిళ’అని పేర్కొన్నారు.
67 ఏళ్ల ఆనంద్ మహీంద్ర ఓ యాక్టివ్ ట్విట్టర్ వినియోగదారుడు. ఆయనకు కోటికిపైగా ఫాలోయర్లు ఉన్నారు. ఆయన తరచూ ప్రేరణాత్మక కథనాలు, మీమ్స్ పోస్ట్ చేస్తుంటారు. అవి ట్విట్టర్ వేదికలో చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News