Monday, January 20, 2025

మహీంద్రా వర్సిటీలో డిజిటల్ ఆధారిత సెంట్రల్ లైబ్రరీ ప్రారంభించిన ఆనంద్ మహీంద్రా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మహీంద్రా యూనివర్సిటీలో డిజిటల్ ఆధారిత సెంట్రల్ లైబ్రరీని ఆనంద్ మహీంద్రా ప్రారంభించారు. ఈ నూతన డిజిటల్ లైబ్రరీలో ఆర్‌ఎఫ్‌ఐడీ ఆధారిత ఆటోమేషన్ వ్యవస్ధ, వై ఫై ఆధారిత లైబ్రరీ వ్యవస్థ ఉంది. ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థుల కోసం లైబ్రరీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహీంద్రా యూనివర్సిటీ ఏడవ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. మహీంద్రా యూనివర్శిటీ ఛాన్స్‌లర్ ఆనంద్ మహీంద్రాతో పాటుగా బోర్డ్ సభ్యులు వినీత్ నయ్యర్, సీపీ గుర్నానీ, డాక్టర్ యాజులు మేడూరి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో సభ్యులు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలు, ఇతర విద్యా భాగస్వామ్యాలను గురించి చర్చించారు. ఈకోల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్ధులు ఫ్యాకల్టీ వినూత్నమైన ప్రాజెక్ట్‌లను ప్రదర్శించారు. రోబోటిక్స్ ల్యాబ్‌కు చెందిన విద్యార్ధులు హ్యూమన్ ఆర్మ్ రీహాబిలిటేషన్ కోసం ఎక్సో-సూట్ డెమో ఇచ్చారు. వీటితో పాటుగా అటానమస్ గైడెడ్ వెహికల్ , లగోరీ కోసం ప్రోజెక్టైల్ లాంచర్ వంటివి ప్రదర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News