Monday, November 25, 2024

మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా

- Advertisement -
- Advertisement -

Anand Mahindra presents XUV700 to Neeraj Chopra, Sumit Antil

నీరజ్ చోప్రా, సుమిత్ అంటిల్‌లకు ఎక్స్‌యువి 700 కార్లు అందజేత

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన హామీని నిలబెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో తొలి సారి జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా, పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలుచుకున్న సుమిత్ అంటిల్‌లకు కొత్తగా తమ కంపెనీ మార్కెట్లో ఆవిష్కరించిన ఎక్స్‌యువి 700 కార్లను స్వయంగా అందజేశారు. హర్యానాలోని పానిపట్‌లోని నీరజ్ చోప్రా, సోనీపట్‌లోని సుమిత్ అంటిల్‌ల నివాసాలకు వెళ్లి ఆయా కార్ల తాళాలను అందజేశారు. తనకు కారు గిఫ్ట్‌గా ఇచ్చినందుకు ఆనంద్ మహీంద్రాకు నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆ కారు డ్రైవ్ చేస్తానని సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. మరో విశేషమేమిటంటే నీరజ్ చోప్రాకు బహూకరించిన కారు నంబరు 8758 కావడం.

ఒటింపిక్స్‌లో నీరజ్ చోప్రా87.58 మీటర్లు జావెలిన్ విసిరి రికార్డు సృష్టించాడు. అదే నంబర్‌తో నీరజ్ చోప్రా కారును రిజిస్టర్ చేశారు. ఇదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇక పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలోనే స్వర్ణ పతకం సాధించిన సుమిత్ అంటిల్‌కు బహూకరించిన కారుకు ఇంకా నంబరు రాలేదు. జావెలిన్ త్రోలో 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెలుచుకున్న సుమిత్ అంటిల్‌ది కూడా ప్రపంచ రికార్డే. అదే నంబర్‌తో ఆయన కారు రిజిస్టర్ కానుంది. ఒలింపిక్స్ పూర్తయ్యాక స్వర్ణ పతకాలు గెలుచుకున్న క్రీడాకారులందరికీ ఇదే ఎక్స్‌యువి 700 మోడల్ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆనంద్ మహీంద్రా ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News