మనసులను పిండేసే వీడియోలను పోస్ట్ చేయడంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తరవాతే ఎవరైనా! తాజాగా ఆయన ఎక్స్ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇలాగే మనసులను ద్రవింపజేస్తోంది. నిజానికి ఈ వీడియో పాతదే అయినా, దీనిని రీపోస్ట్ చేస్తూ, ఆనంద్ మహీంద్రా చేసిన కామెంట్ కూడా ఆకట్టుకుంటోంది.
ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే… అర్జెంటీనాలో ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఓ గోల్ ను గోల్ కీపర్ ఆపలేకపోయాడు. అందుకు గోల్ కీపర్ ఎంతో బాధపడుతుంటే, ఓ పదేళ్ల కుర్రాడు మైదానంలోకి పరుగెత్తుకువచ్చి, గోల్ కీపర్ ను హత్తుకుని ఓదారుస్తున్నాడు! ఈ వీడియోను చూసినవారికి కళ్లు చెమ్మగిల్లకమానవు.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర రీపోస్ట్ చేస్తూ “నా ఇద్దరు మనవలూ నన్ను చూసేందుకు త్వరలో వస్తున్నారు. ఈ వీడియోలో కుర్రాడికి ఉన్నట్టే వాళ్లకి కూడా మంచి మనసు ఉంటే చాలు. అంతకుమించి ఇంకేమీ కోరుకోను” అని కామెంట్ చేశారు. ఆనంద్ మహీంద్రా రీపోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది!.
This little boy apparently ran on to the pitch after a match to console the losing goalkeeper.
My 2 young grandsons will soon be visiting us & I would wish for nothing more than for them to have hearts as empathetic & large as this kid’s..
pic.twitter.com/fQ3uLbHo97— anand mahindra (@anandmahindra) February 11, 2024