Thursday, January 23, 2025

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర

- Advertisement -
- Advertisement -

తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్‌గా ఆనంద్ మహీంద్ర నియమిస్తున్నట్టు న్యూజెర్సీ ప్రవాసుల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా వ్యవహారించాలని తాను కోరటంతో ఆనంద్ మహీంద్ర అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే వారు బాధ్యతలు స్వీకరిస్తారని సిఎం రేవంత్ తెలిపారు. తొలిసారి పబ్లిక్, -ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌ల్లో నైపుణ్యమిచ్చి, ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.

తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వ, -ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే అధినేతగా నియమిస్తామని ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీలోనూ ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా ఇటీవల హైదరాబాద్‌లో ముఖ్యమంత్రితో సమావేశమైన సందర్భంలోనూ తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై చర్చలు జరిపారు. ఈనెల 01వ తేదీన తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా బ్యాగరికంచె వద్ద సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు.

17 రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది, 20వేల మంది విద్యార్థులకు శిక్షణ
ఈ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది, 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సిఎం తెలిపారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి ఉంటారని ఈ బిల్లులో పేర్కొన్నారు. పరిశ్రమల ప్రముఖులతో పాలకమండలి ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌లో ఏడాదికి లక్ష మందికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ వర్సిటీని విస్తరించనున్నట్టు రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు బ్యాగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా -ఈఎస్సీఐ భవనంలో స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ‘ప్రపంచంలో నైపుణ్యానికి చాలా డిమాండ్ ఉంది. యువతకు స్కిల్స్ నేర్పించాలన్న సదుద్దేశంతో కొత్త యూనివర్సిటినీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News