Sunday, December 22, 2024

ప్రజ్ఞానందకు ఆనంద్ మహీంద్రా అరుదైన గిఫ్డ్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇటీవల జరిగిన ఫిడె ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత్ యువ సంచలనం రమేశ్‌బాబు ప్రజ్ఞానందకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అరుదైన బహుమతిని ప్రకటించారు. చారిత్రక ప్రదర్శనతో భారత ఖ్యాతిని ఇనుమడింప చేసిన ప్రజ్ఞానందకు ఎలక్ట్రిక్ కారును బహుమతిగా ఇవ్వాలని ఆనంద్ మహీంద్రా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.

ప్రపంచ చెస్ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానందను అభినందిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి పలువురు నెటిజన్లు స్పందిస్తూ ప్రజ్ఞానందకు థార్ వాహనాన్ని బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ఈ ట్వీట్లకు స్పందించిన ఆనంద్ మహీంద్రా చెస్ సంచలనం ప్రజ్ఞానందకు కారును బహుమతిగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News