Thursday, December 26, 2024

ఫోన్ తర్వాతే రోటీ కపడా ఔర్ మకాన్!.. ఆనంద్ మహీంద్రా వీడియోకు నెటిజన్లు ఫిదా!

- Advertisement -
- Advertisement -

టెక్నాలజీని ప్రోత్సహించడంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుంటారు. ఆలోచింపజేసే వీడియోలను పోస్టు చేస్తూ, యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉంటారు. ఇటీవల ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది…ఆలోచింపజేస్తోంది!

విస్తట్లో వడ్డించిన అరటికాయ బజ్జీని చూసి ఓ పసి పిల్లాడు సెల్ ఫోన్ అనుకుని, తీసి చెవి దగ్గర పెట్టుకున్నాడు! నవ్వు పుట్టించే ఈ వీడియో.. పసి పిల్లలు సైతం సెల్ ఫోన్ కు ఎంతగా బానిసలవుతున్నారో చెప్పకనే చెబుతోంది. అదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా కూడా కామెంట్ చేశారు. “మన జాతి తిరిగి కోలుకోలేనంతగా మారిపోయింది. ఇప్పుడు ఫోన్ తర్వాతే రోటీ కపడా ఔర్ మకాన్!” అంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News