Monday, December 23, 2024

అలా ఐతే కెటిఆర్ ను టాలీవుడ్ లాగేసుకుంటుంది: మహీంద్రా ఆనంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్ లాగేసుకుంటుందని మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. జహీరాబాద్‌లోని మహీంద్రా ప్లాంట్‌లో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మహీంద్రా 3,00,001వ ట్రాక్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం దాన్ని నడిపారు. ఈ విషయాన్ని కెటిఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘హేయ్… ఆనంద్ మహీంద్రా జీ… నన్ను చూడండి… మీ ఉత్పత్తులకు ఎంత చక్కగా ప్రచారం కల్పిస్తున్నానో! అందుకని మీరు తెలంగాణలో మరిన్ని పరిశ్రమలు స్థాపించాల్సి ఉంటుంది‘ అంటూ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాను ఉద్దేశించి చమత్కరించారు. ఈ ట్వీట్ పై ఆనంద్ స్పందించారు. కెటిఆర్ బ్రాండ్ అంబాసీడర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని మీరు కనుక కెమెరా ముందుకు వస్తే టాలీవుడ్ లాగేసుకుంటుందని ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News