ముంబై: టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా ఇక లేరన్న విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా జీర్ణించుకోలేక పోయారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థ నేడు చారిత్రాత్మకమైన స్థానంలో ఉండటానికి ఆయన అందించిన సేవలు కూడా కారణమని పేర్కొన్నారు. ఆయన మార్గదర్శకత్వం భవిష్యత్ తరానికి ఎంతో అమూల్యమన్నారు.
ఆనంద్ మహీంద్రా తన పోస్ట్ లో ‘‘రతన్ టాటా మీరు లేరన్నది స్వీకరించలేకపోతున్నాను. ఓ చారిత్రాత్మక లంగె వేసే దిశలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ స్థితి చేరుకోడానికి రతన్ టాటా జీవితం, కృషి తోడ్పడ్డాయి. మీ గురు పాత్ర, మార్గదర్శకత్వం వెలకట్టలేనిది. ఆయన పోయినా ఆయన ఆదర్శాలను మనం కొనసాగిద్దాం. ఆయన ఆర్థిక సంపద, విజయం మనకెంతో ఉపయోగకరం.
గుడ్ బై అండ్ గాడ్స్పీడ్, మిష్టర్ టి
మిమ్మల్ని మరచిపోలేము.
ఎందుకంటే దిగ్గజాలు ఎన్నడూ చనిపోరు…
ఓం శాంతి’’ అని రాశారు.
I am unable to accept the absence of Ratan Tata.
India’s economy stands on the cusp of a historic leap forward.
And Ratan’s life and work have had much to do with our being in this position.Hence, his mentorship and guidance at this point in time would have been invaluable.… pic.twitter.com/ujJC2ehTTs
— anand mahindra (@anandmahindra) October 9, 2024