Thursday, January 23, 2025

ఎలన్ మస్క్ పై ఆనంద్ మహీంద్ర జోక్ !

- Advertisement -
- Advertisement -

 

Anand Mahindra on Elon Musk Musk

ముంబై: ట్విట్టర్ ను హస్తగతం చేసుకోవాలనుకున్న  ఎలన్ మస్క్ తన 44 బిలియన్ల డాలర్ల కొనుగోలు ఒప్పందం నుండి వైదొలగడంతోపాటు, ఒప్పందాన్ని చెక్కుచెదరకుండా ఉంచడానికి దావా వేయాలని యోచిస్తున్నాడు. సోషల్ నెట్‌వర్క్‌ను స్వాధీనం చేసుకునేందుకు టెస్లా సిఈఓ చేసిన ప్రయత్నం అనేక మలుపులు చూసింది. గత రెండు వారాలుగా, ఎలన్ మస్క్ ప్లాట్‌ఫారమ్‌లో తనకు ఖచ్చితమైన సంఖ్యలో ‘స్పామ్ బాట్‌’లను అందించలేదని ట్విట్టర్‌ను నిందించారు. ట్విట్టర్ రుణంపై కూడా అతను ప్రశ్నలు లేవనెత్తాడు. మస్క్-ట్విట్టర్ రగడ సోషల్ మీడియాలో హైలైట్ అయింది. కాగా భారత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా జోక్యం చేసుకుని   “ట్విట్టర్ టీజ్” అనే ఒక పదాన్ని రూపొందించడం ద్వారా గేలి చేశాడు. “ఎలన్ మస్క్ గనుక భారతీయ రైలులో ప్రయాణిస్తుంటే, కండక్టర్ అతనికి “టిటి” లేక  టికెట్ లెస్ ట్రావెలర్ అని లేబుల్ వేస్తాడు” … “కానీ టిటి ఇప్పుడు ట్విటర్ టీజ్ అన్న అర్థంలో హెడ్లయిన్ గా మారింది.” అని తమాషాగా ఎగతాళి చేశాడు.

మస్క్ స్థానంలో ఆనంద్ మహీంద్రా సోషల్ నెట్‌వర్క్‌ను కొనుగోలు చేయాలని ట్విట్టర్‌లో జోక్ వచ్చింది. ట్విటర్ సిఈఓ పరాగ్ అగర్వాల్ కూడ మన భారతీయుడే అని…అతను,  మహీంద్రాకు ట్విట్టర్ కంపెనీని సరసమైన ధరకు అందించే అవకాశం కూడా ఉంది అని పేర్కొంది. ఇదిలావుండగా ట్విట్టర్ తన ప్లాట్‌ఫారమ్‌లోని ఐదు శాతం ఖాతాలు మాత్రమే నకిలీవని నిరూపించడానికి తగినంత సమాచారాన్ని అందించకుండా తనతో తన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మస్క్ పేర్కొన్నారు. ట్విట్టర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని,  బిలియనీర్ మస్క్ ఇప్పుడు నిరూపించాలి. లేనిపక్షంలో, ఎలన్ మస్క్ పై  1 బిలియన్ డాలర్ల బ్రేకప్ ఫీజు కోసం దావా పడొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News