న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అత్యున్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్ముకశ్మీర్ లో కాంగ్రెస్ కీలక పదవికి రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత ఆనంద్‌శర్మ కూడా తాజాగా అదే బాట పట్టారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ సమావేశాల్లో తనను పట్టించుకోవడం లేదని, సమావేశాలకు తనను ఆహ్వానించడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నేత అయిన ఆనంద్‌శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 26 న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యున్నత కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒకరు. అయితే పార్టీ సమావేశాలకు సంప్రదించకపోవడం, ఆహ్వానించక పోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి ఆనంద్‌శర్మ రాజీనామా
- Advertisement -
- Advertisement -
- Advertisement -