Wednesday, November 13, 2024

ఆనంద్‌జీ.. అందుకే #హ్యాపెనింగ్ హైదరాబాద్ అంటున్నాం

- Advertisement -
- Advertisement -

ఎక్స్ వేదికగా కెటిఆర్

ఆనంద్ జీ.. మరి మీకు ఈ విషయం తెలుసా?
ఆనంద్ మహీంద్రాకు కెటిఆర్ సమాధానం

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోని మంత్రి కెటిఆర్ ఆనంద్ మహీంద్రాకు సమాధానం ఇచ్చారు. “ఆనంద్ జీ మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అంతేకాదు, యాపిల్, మెటా, క్వాల్‌కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ వంటి ఎన్నో సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో తమ భారీ క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే.. #హ్యాపెనింగ్ హైదరాబాద్ అని మేమనేది. అమెజాన్ క్యాంపస్‌ను ఫొటోను కూడా అటాచ్ చేశాను చూడండి” అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో, భాగ్యనగరం పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అంతకు ముందు.. హైదరాబాద్ విశ్వనగరం అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలో మిగిలిన ప్రధాన నగరాలకు లేని అనేక సానుకూలతలు భాగ్యనగరానికి సొంతం. అందుకే, అమెరికాకు ఆవల అతిపెద్ద క్యాంప్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ హైదరాబాద్‌ను ఎంచుకుంది. అయితే, క్యాంపస్ నిర్మాణ పనులు జరగుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ ఈ ప్రాజెక్టు విశిష్టతను పేర్కొన్నారు. “ఇది ఓ బిల్డింగ్‌కు సంబంధించిన వార్త కాదు. దీని ప్రాముఖ్యత పూర్తిగా అర్థమయ్యేలా నేను వార్తను వీలైనంత సావకాశంగా చదివా. గూగుల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజం అమెరికా ఆవల అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు ఓ దేశాన్ని ఎంపిక చేసిందంటే ఇది కేవలం వాణిజ్య వార్త కాదు. భౌగోళిక రాజకీయ ప్రాధాన్యమున్న వార్త” అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News