Wednesday, January 22, 2025

కిటకిటలాడుతున్న జామ్ నగర్.. బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ అక్కడే!

- Advertisement -
- Advertisement -

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అయిన ముఖేశ్ అంబానీ కుమారుడి  ప్రీ వెడ్డింగ్  వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. తొలిరోజు ఈ వేడుకలకు దేశవిదేశాలనుంచి ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ సెలబ్రిటీస్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, అలియా భట్, సయీఫ్ అలీఖాన్, కరీనా కపూర్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, మెటా సిఇఓ మార్క్ జుకర్ బెర్గ్, ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఎమ్మెస్ ధోని, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్, పలువురు రాజకీయ నాయకులు తొలిరోజు వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ఈ వేడుకలకు తన భార్యతో సహా నల్లటి దుస్తులు ధరించి హాజరైన జుకర్ బెర్గ్ తమ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, భారతీయ వివాహానికి హాజరైనందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలో ఒకటి కానున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు శుభాకాంక్షలు చెప్పారు. తొలి రోజు వేడుకల్లో పాప్ స్టార్ రిహానా ప్రధాన ఆకర్షణగా మారింది. తనదైన గానంతో ఆమె ఆహూతులను ఉర్రూతలూగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News