Sunday, December 22, 2024

బిల్‌గేట్స్ నుంచి ఇవాంకా ట్రంప్ వరకు..

- Advertisement -
- Advertisement -

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి
ప్రపంచ దేశాల నుంచి అతిథులు

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త విరేన్ మర్చంట్ కుమార్తే రాధికా మర్చంట్ వివాహానికి ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. మూడు రోజుల ప్రి వెడ్డింగ్ వేడుకలు మార్చి 1 నుంచి 3 వరకు అంబానీ ఎస్టేట్‌లో జరుగనున్నాయి.

ఈ వివాహానికి రాబోయే అతిథుల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నేతలు, వ్యాపారులు ఉన్నారు. అనంత్, రాధికా ప్రివెడ్డింగ్ రాబోయే అతిథుల్లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, బిల్ అండ్ మెలిండా గేట్స్ చైర్‌పర్సన్ మెలిండా గేట్స్, మెటా సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్, బ్లాక్‌రాక్ సిఇఒ లారీ ఫింక్, డిస్నీ సిఇఒ బాబ్ ఇగర్, ఇవాంకా ట్రంప్, మోర్గాన్ స్టాన్లీ సిఇఒ టెడ్ పిక్, ఇంకా అనేకమంది దిగ్గజాలు ఉన్నారు.

అయితే ఈ పెళ్లిపై దేశంలో పెద్ద చర్చే జరుగుతోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకకు ముందు కూడా అంబానీ కుటుంబానికి కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి కోట్ల విలువైన బహుమతులు వచ్చాయి. ముఖేష్, నీతా అంబానీల నుంచి రూ.4.5 కోట్ల విలువైన కారును అందుకున్నారు. మీడియా కథనాల ప్రకారం, రాధిక మర్చంట్ ఒక వెలకట్టలేని డైమండ్ చోకర్ (నెక్లెస్) అందుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News