Thursday, January 23, 2025

అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబైలోని అంబానీ నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సంప్రదాయబద్ధంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. గుజరాతీ సంప్రదాయమైన గోల్‌ ధన, చునారివిధి వంటి కార్యక్రమాలతో ఈ నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు. బెల్లం, దనియాలతో జరుపుకునే ఈ వేడుక వరుడి ఇంట్లో చేస్తారు. ఈ కార్యక్రమానికి హాజరైన వధువు తరుపున అతిథులు, బంధువులు బహుమతులు, స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అనంతరం లగ్న పత్రికను చదివారు.

ఆ తర్వాత అనంత్‌-రాధికలు ఉంగరాలు మార్చుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులు నృత్యంతో అలరించారు. అనంత్‌ అంబానీ అమెరికాలోని బ్రౌన్‌ యూరివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసి.. జియో, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. అలాగే న్యూయార్క్‌ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన రాధిక మర్చంట్‌ ఎన్‌కోర్‌ హెల్త్‌ కేర్‌ బోర్డులో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News