Wednesday, January 22, 2025

కుబేరుడి ఇంట్లో పెళ్లి… ఖర్చుకు తగ్గేదేలే!

- Advertisement -
- Advertisement -

ఆసియా కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలా! ఆకాశమంత పందిరి వేసి, భూదేవంత పీట వేసి అంగరంగవైభవంగా చేస్తున్న ఈ వివాహానికి డబ్బును మంచినీళ్లప్రాయంలా ఖర్చు చేస్తున్నారు! ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలో చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం జులై 12న జరగనుంది. ఈ పెళ్లికి ముందుగా మూడు రోజుల పాటు ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ శుక్రవారంనుంచీ మొదలయ్యాయి. గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రపంచంలోని అతిరథ మహారథులంతా తరలివస్తున్నారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మెటా ప్లాట్ ఫామ్స్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచయ్, ఆరామ్కో చైర్మన్ యాసిర్ అల్ రుమయ్యన్, ఇవాంకా ట్రంప్ వంటివారు ఉన్నారు. ఇక మన దేశానికి చెందిన అతిథుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ నటులు ఈ జాబితాలో ఉన్నారు.

ఆహూతులను అలరించేందుకు ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా, ఇల్యూషనిస్ట్ డేవిడ్ బ్లయిన్ వస్తున్నారు. రిహన్నాకు నాలుగు గంటలు ప్రదర్శన ఇచ్చినందుకు రూ.75 కోట్లు ముట్టజెబుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పెళ్లి వేడుకలకు వస్తున్న అతిథుల్లో కొందరు జామ్ నగర్ లో ఉన్న జంతువుల రిహాబిలిటేషన్ సెంటర్ ను చూడాలని ముచ్చటపడుతున్నారు. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ కలల ప్రాజెక్టు ఇది. ఈ సెంటర్లో వందలాది ఏనుగులు, మొసళ్లు, పులులు, సింహాలు ఉన్నాయి. వీటి సంరక్షణను అనంత్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు.

Anant Radhika Wedding

ఇక అతిథులకు దేశవిదేశీ రుచులు చూపించేందుకు భారీయెత్తున ఏర్పాట్లు జరిగాయి. రోజుకు 500కు పైగా ఆహారపదార్థాలు వండివస్తున్నారు.

Anant Radhika Wedding

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News