Monday, December 23, 2024

గొంతు కోసి మాజీ ప్రిన్సిపాల్ హత్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ ఇంజినీరింగ్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా జెఎన్‌టియు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురంలోని అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీలో మూర్తిరావు ఖోకలే(59) గతంలో ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. జెఎన్‌టియు సమీపంలో ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. ఆస్తి తగదాల విషయంలో మేనల్లుడితో మూర్తిరావుకు గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆయన మేనల్లుడు మూర్తిరావు గొంతు కోసి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కుమార్తె పెళ్లి విషయం నచ్చక పోవడంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News