Sunday, December 22, 2024

చిన్నారి ప్రాణం తీసిన నిమ్మకాయ..

- Advertisement -
- Advertisement -

అమరావతి: నిమ్మకాయ మింగి పసిపాప మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లెనిపల్లిలో గోవిందరాజులు-సకీదీప అనే దంపతులు నివసిస్తున్నారు. సకీదీప వాలంటీర్‌గా పనిచేస్తుంది. వివాహం జరిగిన ఏడు సంవత్సరాల తరువాత పాప జన్మించడంతో అల్లారముద్దుగా తల్లిదండ్రులు పెంచుకుంటున్నారు. కూతురుకు జశ్వితగా పేరు నామకరణం చేశారు. జశ్విత నిమ్మకాయతో ఆడుకుంటుండగా తల్లి గమనించింది.

నోట్లో పెట్టుకోవడంతో గమనించి నిమ్మకాయ బయటకు తీయడానికి ప్రయత్నించింది. గొంతులోకి నిమ్మకాయ వెళ్లడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది పడడంతో మెరుగైన చికిత్స నిమిత్తం పామిడికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పాప చనిపోయిందని తెలిపారు. దీంతో దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నారి మృతదేహంపై పడి తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతమయ్యారు. లేకలేక పుట్టిన బిడ్డను అప్పుడే తీసుకెళ్లావా? దేవుడా? అంటూ గుండెలు పగిలేలా రోధించిన తీరు స్థానికులు కూడా కన్నీంటిపర్యంతమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News