అమరావతి: వైసిపి నేత తోపుదుర్తి సోదరులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడు రైలు పట్టాలపై శవంగా మారాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తోపుదుర్తి గ్రామానికి చంఎదిన టి మహేశ్వర్ రెడ్డి(24), పాలచెర్ల గ్రామానికి చెందిన మురళి అనే యువకుడితో కలిసి సొములదొడ్డి గ్రామానికి వెళ్లారు. మహేశ్వర్ రెడ్డికి యువకుడు తనకు పని ఉందని, అనంతపురం వెళ్తున్నానని చెప్పి వెళ్లిపోయాడు. శనివారం రాత్రి పది గంటల సమయంలో తన పని అయిపోయిందని సోముల దొడ్డికి రావాలని మహేశ్వర్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. యువకుడు సోములదొడ్డికి వచ్చిన తరువాత మహేశ్వర్ రెడ్డి ఫోన్ కాల్ చేశాడు.
స్విచ్ఛాఫ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు సోములదొడ్డి గ్రామ శివారులో వెతికారు. నాగారెడ్డి, సోములదొడ్డి గ్రామాల మధ్య మహేశ్వర్ రెడ్డి మృతదేహం కనిపించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. 2019 నుంచి తన కుమారుడు టిడిపి సహకరించరనే ఉద్దేశంతో రాప్తాడు మాజీ ఎంఎల్‌ఎ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి తన కుటుంబంపై పగ పెంచుకున్నాడని మృతుడి తండ్రి మల్లారెడ్డి తెలిపారు. వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తనపై కుమారుడు అక్రమ కేసులు బనాయించి జైళ్లో పెట్టించారన్నారు. తన భూమిని ఆన్‌లైన తొలగించారని తెలిపారు. జనవరి 1న పరిటాల శ్రీరామ్ తన కుమారుడు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో రాజశేఖర్ రెడ్డి తన కుమారుడిని బెదిరించారన్నారు.