Monday, December 23, 2024

‘బేబి’కి మరో గౌరవం..

- Advertisement -
- Advertisement -

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్‌బస్టర్ బేబి మరో గౌరవాన్ని దక్కించుకుంది. ఈ చిత్రానికి లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ బెస్ట్ లిరిక్ రైటర్‌గా ఐఫా అవార్డ్ దక్కించుకున్నారు. ’ఓ రెండు మేఘాలిలా..’ పాటకు ఆయనకు ఐఫా అవార్డ్ సొంతమైంది. దీంతో బేబి సినిమాకు బెస్ట్ లిరిక్ రైటర్‌గా అన్ని మేజర్ అవార్డ్ స్వీప్ చేశారు అనంత శ్రీరామ్.

ఈ అవార్డ్ తీసుకున్న సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్‌తో కలిసి అనంత శ్రీరామ్ ఫొటో తీసుకున్నారు. ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ అనంత శ్రీరామ్ ను అభినందించారు. బేబి సినిమాకు ఇప్పటిదాకా ఫిలింఫేర్, సైమా, గామా వంటి అనేక గొప్ప పురస్కారాలు దక్కాయి. ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్, డైరెక్టర్ సాయి రాజేష్ కాంబినేషన్‌లో బాలీవుడ్‌లో బేబి సినిమా రీమేక్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News