Thursday, November 21, 2024

కమర్షియల్ అంశాలు, సందేశంతో కూడిన సినిమా

- Advertisement -
- Advertisement -

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొట్టేల్ సినిమా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “డైరెక్టర్ సాహిత్ చెప్పిన కథ చాలా బావుంది. ఇందులో చదువు అనే పాయింట్ చాలా నచ్చింది. ఇంత మంచి కాన్సెప్ట్, కథలో ఎలా అయిన పార్ట్ కావాలని చేశాను. ఇందులో నా క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా క్యారెక్టర్ పేరు బుజ్జమ్మ. ఇప్పటివరకూ మల్లేశం అనన్య, వకీల్ సాబ్ అనన్య అనే పిలుస్తుంటారు.

ఈ సినిమా తర్వాత బుజ్జమ్మ అనన్య అని పిలుస్తారు. అంత ప్రభావాన్ని చూపిస్తుంది ఈ సినిమా. ఇందులో నాది చాలా బలమైన పాత్ర. ఇక పొట్టేల్ లేకపోతే ఈ కథ లేదు. పొట్టేల్ పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకొడుతుంది కానీ ఆగదు. అది పొట్టేల్ నేచర్. ఈ సినిమాలో మా హీరో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఏ సమస్య వచ్చిన ముందుకు వెళ్లడమే కానీ వెనక్కి వచ్చే సమస్య లేదు. అలా రెండు విధాలుగా ఈ సినిమా టైటిల్‌కి జస్టిఫికేషన్ వచ్చింది. కమర్షియల్ అంశాలను, సందేశాన్ని, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా మిళితం చేసిన సినిమా ఇది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా నచ్చింది. యువ, పాప మధ్య వచ్చే సీన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వల్ల చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. అందరూ అద్భుతంగా నటించారు. ఇక ప్రస్తుతం నేను చేసిన శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. సతీష్ వేగేశ్న కథకళి సినిమా జరుగుతోంది. ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమా చేస్తున్నాను”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News