Sunday, April 13, 2025

బాలీవుడ్ మూవీలో నటిస్తున్న అనన్య నాగళ్ళ

- Advertisement -
- Advertisement -

కష్టపడేతత్వం, అంకితభాతం ఉంటే కచ్చితంగా హీరోయిన్లుగా నిలదొక్కుకోవచ్చు అని కొంతమంది తెలుగమ్మాయి లు నిరూపించారు. కొంతమంది అయితే ఉమెన్ సెంట్రిక్ సినిమాల్లో మెయిన్ లీడ్ గా చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. అలాంటి తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్‌గా సూపర్ హిట్‌ను అందుకుంది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో న టించే ఛాన్స్ దక్కింది.

అటు తర్వాత ప్లే బ్యాక్, తంత్ర, పొట్టేల్ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో అ ద్భుత నటన కనపరిచి బిజీ హీరోయిన్ గా ఎదిగారు. ఇప్పుడు ఏక్తా ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌లో హిమ్మత్ లడుమోర్ నిర్మాణంలో ఓ ఉమెన్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారట అనన్య నాగళ్ళ. రాకేష్ జగ్గి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె ఓ గిరిజన అమ్మాయిగా మెయిన్ లీడ్‌గా కనిపించనున్నట్టు తెలిసింది. ’కాంత’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News