Sunday, January 19, 2025

ఈ సినిమాలో కథే హీరో:అనన్య నాగళ్ల

- Advertisement -
- Advertisement -

వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ’శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ సక్సెస్ రైడ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ప్రెస్ మీట్ లో వంశీ నందిపాటి మాట్లాడుతూ “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది.

3 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమాలో కథే హీరో. కథని నమ్మే ఈ సినిమాతో ముందుకు వెళ్తున్నాను. ఇది సస్పెన్స్ థ్రిల్లర్‌”అని అన్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ “ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. కథ, నా క్యారెక్టర్ రెండూ నచ్చాయి. క్యారెక్టరైజెషన్ చాలా కొత్తగా వుంటుంది. ఈ సినిమాతో మంచి విజయం వస్తుందనే నమ్మకం వుంది”అని పేర్కొన్నారు. డైరెక్టర్ రైటర్ మోహన్ మాట్లాడుతూ “ఉత్తరాంద్ర నేపధ్యంలో జరిగే కథ ఇది. వెన్నెల కిషోర్‌తో పాటు సినిమాలో నటించిన అందరూ ఆ యాసని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామణారెడ్డి, అనీష్ కురివిల్లా, రవితేజ, నాగ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News